అమరావతి రైతులు తలపెట్టిన మహా పాదయాత్ర(Maha padayatra)కు వైకాపా మినహా అన్ని రాజకీయ పక్షాలు మద్దతు తెలిపాయి. రాజధాని రైతులు చేపట్టిన మహా పాదయాత్ర(amaravati farmers Maha padayatra)కు తెదేపా సంపూర్ణ మద్దతు (tdp support)ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. మహా పాదయాత్రలో తెదేపా కార్యకర్తలు, నాయకులు పాల్గొని వారికి అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. రైతుల పాదయాత్ర విజయవంతం కావాలని కోరుకుంటున్నామని అన్నారు. రైతుల మహాపాదయాత్రకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్న అచ్చెన్న.. 685 రోజులుగా రైతులు ఉద్యమం చేస్తుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సిగ్గుచేటన్నారు.
ఉద్యమాభివందనాలు.. : లోకేశ్
అణచివేత, అవమానాలు ఎదురైనా ఎత్తిన జెండా దించకుండా.. 685 రోజులుగా జై అమరావతి అంటూ నినదిస్తున్న రైతులకు, మహిళలకు, యువతకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(nara lokesh) ఉద్యమాభివందనాలు తెలిపారు. ఒకే రాష్ట్రం - ఒకే రాజధాని నినాదంతో ప్రజా రాజధాని అమరావతి(amaravati) పరిరక్షణ కోసం రైతులు తలపెట్టిన మహా పాదయాత్ర విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు లోకేశ్ తెలిపారు. శ్రీవారి ఆశీస్సులతో పాలకుల ఆలోచనధోరణిలో మార్పు వచ్చి అమరావతి రాజధానిగా కొనసాగాలన్నారు.
మహాపాదయాత్రలో పాల్గొన్న నేతలు
అమరావతి రైతులు తలపెట్టిన మహా పాదయాత్ర(Maha padayatra)కు వైకాపా మినహా అన్ని రాజకీయ పక్షాలు మద్దతు తెలిపాయి. ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ తరఫున సీనియర్ నేతలు దేవినేని ఉమా, ప్రతిపాటి పుల్లరావు, తెనాలి శ్రావణ్ కుమార్, మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, గొనుగోంట్ల కోటేశ్వరరావు పాల్గొన్నారు.
సీపీఐ మద్దతు
అమరావతి రైతులు తలపెట్టిన మహా పాదయాత్రకు సీపీఐ జాతీయ ప్రధానకార్యదర్శి నారాయణ (cpi narayana support)మద్దతు తెలిపారు. ప్రభుత్వ విధానాలను తప్పుబట్టిన నారాయణ.. ప్రతి జిల్లాలో రైతుల పాదయాత్రకు సీపీఐ శ్రేణులు అండగా నిలుస్తారన్నారు. తుళ్లూరు నుంచి పెదపరిమి వరకు నారాయణ పాదయాత్రలో పాల్గొన్నారు.
మహా పాదయాత్రకు విరాళం
అమరావతి రైతులు తలపెట్టిన మహా పాదయాత్రకు రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ రూ.ఏడు లక్షల విరాళం ప్రకటించారు. న్యాయపోరాటం చేస్తున్న రైతులకు న్యాయదేవత ఆశ్సీస్సులతోపాటు.. దేవుడి ఆశ్సీస్సులు ఉంటాయని ఆయన ఆకాక్షించారు. గద్దె అనురాధ రూ.లక్ష ప్రకటించారు. వైకాపా నుంచి ఎంపీ రఘురామరాజు(ycp mp raghurama support) రైతుల పాదయాత్రకు మద్దతు తెలపటంతో పాటు.. రూ.3లక్షల మేర విరాళం ప్రకటించినట్లు రైతులు తెలిపారు.