అక్షయ తృతీయ సందర్భంగా విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం యాగశాలలో ఆలయ స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ, ప్రధాన అర్చకులు దుర్గా ప్రసాద్, ఆలయ వైదిక కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీమహాలక్ష్మి మహామంత్ర హవనం చేపట్టారు. ఈ క్రతువులో పాలకమండలి ఛైర్మన్ పైలా సోమినాయుడు, ఆలయ కార్యనిర్వాహణాధికారి సురేష్ బాబు పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో భక్తులను అనుమతించడంలేదు. నిత్య కైంకర్యాలన్నీ ఏకాంతంగా నిర్వహిస్తున్నారు.
అక్షయ తృతీయ సందర్భంగా ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక పూజలు - విజయవాడ దుర్గ గుడిలో అక్షయ తృతీయ పూజలు తాజా వార్తలు
అక్షయ తృతీయ పర్వదినం సందర్భంగా విజయవాడ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారుల ఆధ్వర్యంలో శ్రీమహాలక్ష్మీ మహామంత్ర హవనం చేపట్టారు.

అక్షయ తృతీయ సందర్భంగా ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక పూజలు