కరోనా వైరస్ బారిన పడకుండా ఉండేందుకు 2 శాతం బెటాడిన్ ద్రావణం పుక్కిలింతను పరిష్కార మార్గంగా అనుసరించొచ్చని ఆంధ్రప్రదేశ్ శాంతిభద్రతల విభాగం అదనపు డీజీపీ రవిశంకర్ అయ్యన్నార్ సూచించారు. స్వతహాగా వైద్యుడైన ఆయన ఈ చిట్కాను ఎలా పాటించాలో సూచిస్తూ తెలుగు, ఆంగ్ల భాషల్లో వీడియోను రూపొందించారు. బెటాడిన్ గార్గిల్ ద్రావణంలో పొవైడొన్ అయోడిన్ ఉంటుంది. వైరస్‌లను అది సంహరిస్తుంది. దక్షిణకొరియా, అమెరికా తదితర దేశాల్లో ఈ చిట్కాను విస్తృతంగా పాటిస్తున్నారు. దీంతో ఫలితం ఉందని పరిశోధన పత్రాలు ప్రచురితమయ్యాయని అయ్యన్నార్ పేర్కొన్నారు.
కరోనా నియంత్రణకు అదనపు డీజీపీ చిట్కా
కరోనా బారిన పడకుండా ఉండేందుకు ఆంధ్రప్రదేశ్ శాంతిభద్రతల విభాగం అదనపు డీజీపీ రవిశంకర్ అయ్యన్నార్ ఓ చిట్కాను సూచించారు. 2 శాతం బెటాడిన్ ద్రావణం పుక్కిలింతను పరిష్కార మార్గంగా అనుసరించొచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ చిట్కాను ఎలా పాటించాలో సూచిస్తూ తెలుగు, ఆంగ్ల భాషల్లో వీడియోను రూపొందించారు.
కరోనా నివారణకు అదనపు డీజీపీ చిట్కా
ఎలా వాడాలంటే?
15 మి.లీ పరిమాణంలో ద్రావణాన్ని ఓ కప్పులో తీసుకుని అంతే పరిమాణం నీటిని ఆ ద్రావణానికి కలపాలి. ఇయర్ బడ్స్ సహాయంతో ఆ మిశ్రమాన్ని ముక్కు రంద్రాల్లో పూసుకోవాలి. మిగతా ద్రావణాన్ని నోటిలో వేసి 30 నిమిషాల పాటు పుక్కిలించి ఉమ్మేయాలి. ఇలా రోజులో మూడు నాలుగుసార్లు చేయాలని సూచించారు.
ఇదీ చూడండి:కరోనా నివారణకు నారా లోకేశ్ చిట్కాలు..!
Last Updated : Apr 24, 2020, 10:36 AM IST