రాష్ట్రంలోని 12 ప్రముఖ దేవాలయాలతో కూడిన క్యాలెండర్ను దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విజయవాడలో ఆవిష్కరించారు. నూతన సంవత్సరం 2020 క్యాలెండర్ రూపొందించడం ఇదే మొదటిసారని మంత్రి తెలిపారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేవాదాయశాఖలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టామని.. దేవాలయాల భూములను ఆక్రమణలకు గురి కాకుండా చూస్తున్నామని అన్నారు. హిందూమతం, దేవాలయాలపైనా అన్యమత ప్రచారమంటూ రాజకీయ పార్టీలు ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నాయని మంత్రి ఆరోపించారు.
నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి వెల్లంపల్లి - A calendar made of 12 temples inaugurationnewsupdates
రాష్ట్రంలోని 12 ప్రముఖ దేవాలయాలతో చేసిన నూతన సంవత్సర క్యాలెండర్ను దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విజయవాడలో ఆవిష్కరించారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. దేవాదాయశాఖలో అనేక మార్పులు చేశామని.. ప్రసిద్ధ దేవాలయాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తున్నామని మంత్రి అన్నారు.
12 దేవాలయాలతో చేసిన క్యాలెండర్...ఆవిష్కరణ