దసరా పండుగ (DUSSEHRA) రద్దీ దృష్ట్యా పలు ప్రాంతాలకు 4 వేల ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు (APSRTC MD) తెలిపారు. ఈ నెల 8 నుంచి 18 వరకు ప్రత్యేక బస్సులు నడుస్తాయని, ప్రత్యేక బస్సుల్లో 50శాతం అదనపు ఛార్జీలు అమలు చేస్తామన్నారు. ఒక వైపు మాత్రమే రద్దీ ఉంటోన్న కారణంగా నష్టం రాకుండా ఉండేందుకు అదనపు చార్జీలు వసూలు చేస్తున్నట్టు ఆయన వివరించారు. రెగ్యులర్ బస్సు సర్వీసుల్లో అదనపు చార్జీలు ఉండవన్నారు. అన్ని బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ చేసుకునే సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు.
APSRTC: పండక్కి 4వేల ప్రత్యేక బస్సులు: ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు - ఏపీలో దసరా ప్రత్యేక సర్వీసుల సమాచారం
దసరా పండుగ (DUSSEHRA)రద్దీ దృష్ట్యా పలు ప్రాంతాలకు 4 వేల ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు (APSRTC MD) తెలిపారు. ఈ నెల 8 నుంచి 18 వరకు ప్రత్యేక బస్సులు నడుస్తాయని, ప్రత్యేక బస్సుల్లో 50శాతం అదనపు ఛార్జీలు అమలు చేస్తామన్నారు.
విలీనం తర్వాత ఆర్టీసీ కార్మికుల సమస్యలను ఒక్కోటిగా పరిష్కరిస్తున్నామన్న ఎండీ..2020 జనవరి 1 తర్వాత చనిపోయిన కార్మికుల కుటుంబాలకు కారుణ్య నియామకాలకు ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. ఆర్టీసీ సిబ్బందికి 20-21 ఏడాదికి సంబంధించి లీవ్ ఎన్ క్యాష్ మెంట్ మంజూరు చేశామన్నారు. సిబ్బంది కుటుంబాలకు ఈహెచ్ ఎస్ కార్డులు జారీ పూర్తైందన్నారు. డీజిల్ ధరల పెంపుతో సంస్థపై చాలా ఎక్కువగా భారం పడుతోందన్న ఎండీ... సంస్థలో నిర్వహణ వ్యయం తగ్గించేందుకు వంద ఎలక్ట్రిక్ బస్సులను (Electric Buses) త్వరలో ప్రవేశపెడతామన్నారు. ఆదాయార్జన కోసం కార్గో సహా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సిబ్బంది సంక్షేమం, సంస్థ ఆదాయం పెంపు, నిర్వహణ వ్యయం తగ్గింపు అంశాలపై ప్రధానంగా దృష్టి పెట్టామన్నారు. త్వరలో అన్ని బస్సుల్లో లైవ్ ట్రాకింగ్ అమలు చేస్తామన్నారు. పల్లె వెలుగు బస్సుల మోడల్ ను మార్చుతున్నట్లు తెలిపారు.ప్రైవేటువాహనాల అక్రమ రవాణా నివారణకు ఈ నెలలో ప్రత్యేక డ్రైవ్ చేపడతామన్నారు.సంస్థపై పడుతోన్న భారాన్ని , నష్టాలు,పెండింగ్ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తామన్నారు ఎండీ. ప్రస్తుతానికి ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంచే ప్రతిపాదనలేవీ లేవని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి : CM JAGAN: రాష్ట్రంలోనే అన్ని వ్యాధులకు చికిత్స అందించేలా చూడాలి: సీఎం జగన్