ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 11AM - ap top ten news

పండించేంత వరకే రైతు.. కంపెనీలదే పూర్తి పెత్తనమంటున్న కేంద్ర వ్యవసాయ శాఖ.., కొత్త విద్యావిధానానికి అనుగుణంగా పాఠశాలల్లో మార్పులు.., ఆ దేవాలయ పాలక మండలి సభ్యురాలు రాజీనామా.., కామాంధుల చేతుల్లో నలిగిపోతున్న బాల్యం.., నేనే గెలిచానంటున్న ట్రంప్.., పాపం ఉతప్ప.. బంతికి ఉమ్మి రాస్తూ.., 'నక్కిలీసు గొలుసు' దుర్గారావు నుంచి మైకేల్ జాక్సన్ వరకు వైరల్ వీడియోలు కోసం కింద లింక్ లను లేట్ చేయకుండా క్లిక్ చేసేయండి...

11am top news
నేటి ప్రధాన వార్తలు @ 11AM

By

Published : Oct 1, 2020, 11:32 AM IST

Updated : Oct 1, 2020, 11:38 AM IST

  • కంపెనీలదే పెత్తనం.. ఒప్పందం జవదాటలేని అన్నదాత

ఒప్పంద సేద్యంలో కంపెనీలదే పెత్తనం. ఒకసారి ఒప్పందం చేసుకుంటే అన్నదాత జవదాటలేని పరిస్థితి. పంటల బీమా కూడా రైతు సొమ్ముతో చేయించాలి. 13 పేజీల్లో ‘ఒప్పంద సేద్య పత్రం’ నమూనాను కేంద్ర వ్యవసాయ శాఖ రాష్ట్రాలకు పంపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఇకపై సగమే పాఠశాలలు.. జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా మార్పులు

పాఠశాలల సముదాయాల్లో ఇక సగమే ఉంటాయా అంటే అవునంటున్నాయి విద్య వర్గాలు.. విద్యార్థులందరికీ ఆధునిక సౌకర్యాలు అందేలా చర్యలు చేపడుతూనే.. ఒకే దాంట్లో ఎక్కువ బడులు, ఉపాధ్యాయులు ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. జాతీయ విద్యావిధానం - 2020’కి అనుగుణంగా ప్రభుత్వం మార్పులు చేపట్టగా ఈ ప్రక్రియ కృష్ణా జిల్లాలో తుది దశకు చేరుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • హైదరాబాద్‌లో ఏపీ ఐఎఫ్‌ఎస్ అధికారి అత్మహత్య

హైదరాబాద్‌లో ఏపీ ఐఎఫ్‌ఎస్ అధికారి వి.బి.రమణమూర్తి ఆత్మహత్య కలకలం రేపుతోంది. నాగోల్‌లోని అపార్టుమెంట్‌ ఐదో అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • విజయవాడ దుర్గ గుడి పాలకమండలి సభ్యురాలు రాజీనామా

విజయవాడ దుర్గ గుడి పాలకమండలి సభ్యురాలు నాగ వరలక్ష్మీ రాజీనామా చేశారు. నిన్న తన కారులో మద్యం సీసాలు దొరికన అంశంపై రాజీనామా చేసిన ఆమె.. విచారణ పూర్తయ్యేవరకు పదవిలో కొనసాగనని లేఖలో పేర్కొన్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • వేధింపుల మధ్య బాల్యం.. కష్టాల నడుమ పసితనం

ఆటపాటలతో సాగాల్సిన బాల్యం వేధింపుల బారిన పడుతోంది. అల్లారుముద్దుగా పెరగాల్సిన పసితనం కష్టాల నడుమ కొట్టుమిట్టాడుతోంది. రాష్ట్రంలో గత 16 నెలల కాలంలో చిన్నారులపై వేధింపుల ఘటనలు ఎక్కువగా జరిగాయి. చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ(సీడబ్ల్యూసీ) దృష్టికి వచ్చిన వివరాల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటివి నాలుగున్నర వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రాష్ట్రపతి పుట్టినరోజు- మోదీ, వెంకయ్య శుభాకాంక్షలు

రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ 75వ జన్మదినం సందర్భగా గురువారం ఉపరాష్ట్రపతి, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్​ షా శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • తొలి డిబేట్ గెలిచింది నేనే: ట్రంప్

డెమొక్రాటిక్ నేత జో బైడెన్​తో జరిగిన తొలి సంవాదంలో తానే గెలిచానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించుకున్నారు. డిబేట్​లో బైడెన్ బలహీనంగా కనిపించారన్నారు. త్వరలో జరగబోయే చర్చ నుంచి తప్పుకోవాలని బైడెన్ ఆలోచిస్తున్నారని జోస్యం పలికారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • బ్యాంకు, ఆటో షేర్ల దూకుడు.. భారీ లాభాల్లో మార్కెట్లు

బ్యాంకు, ఆటో, మెటల్స్​ షేర్ల దూకుడుతో దేశీయ స్టాక్​ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్​ 450 పాయింట్లకుపైగా లాభంతో దూసుకెళుతోంది. నిఫ్టీ 11 వేలపైన ట్రేడవుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • బంతికి ఉమ్మి రాస్తూ అడ్డంగా దొరికిన ఉతప్ప

ఐసీసీ నిబంధనలు అతిక్రమించిన సీనియర్ ఆటగాడు ఉతప్ప.. ఐపీఎల్ మ్యాచ్​లో బంతికి ఉమ్మి రాస్తూ కెమెరా కంటికి చిక్కాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్​గా మారింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'నక్కిలీసు గొలుసు' ట్రెండ్.. దుర్గారావు నుంచి మైకేల్ జాక్సన్ వరకు

'పలాస' సినిమాలో 'నక్కిలీసు గొలుసు' పాట సోషల్ మీడియాలో తెగ ఊపు ఊపేస్తోంది. పలువురు సెలబ్రిటీలు ఈ పాటను మిక్స్ చేసి డ్యాన్స్ చేసిన వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Last Updated : Oct 1, 2020, 11:38 AM IST

ABOUT THE AUTHOR

...view details