ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 31, 2020, 1:44 PM IST

ETV Bharat / city

లిఫ్ట్ రాకుండానే తెరుచుకున్న తలుపులు.. షార్​ ఉద్యోగి మృతి..

లిఫ్ట్ రాకుండానే తలుపులు తెరుచుకోవటంతో బాక్స్ పై పడి ఓ షార్ ఉద్యోగి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా, తిరుపతిలోని శ్రీనివాసం సముదాయం వెనుక అపార్ట్మెంట్​లో జరిగింది. ఈ మృతిపై తిరుపతి తూర్పు​ పోలీసులు అపార్ట్మెంట్ యజమానిపై కేసు నమోదు చేసుకున్నారు.

Woman died falling in elevator at Tirupati in Chittoor district
లిఫ్ట్ రాకుండానే తలుపులు తెరుచుకోవటంతో.. మహిళ మృతి..

లిఫ్ట్ రాకుండానే తలుపులు తెరుచుకోవటంతో ఓ మహిళ లిఫ్డు గుంతలోకి జారిపోయారు. అడుగున ఉన్న లిఫ్ట్ బాక్స్ పై పడి ఆమె మృతి చెందారు.

శ్రీ హరికోటలోని షార్​లో సీనియర్ ఆఫీసర్​గా విధులు నిర్వహిస్తున్న వాసంతి(55)... కుమార్తె చదువు కోసం తిరుపతిలోని శ్రీనివాసం సముదాయం వెనుక అద్దెకు దిగారు. అపార్ట్మెంట్ నుంచి బయటకు వస్తున్న వాసంతి.. లిఫ్ట్ బటన్​ నొక్కారు. వెంటనే లిఫ్టుకు ఉండే గ్రిల్స్​ తెరుచుకున్నాయి. లిఫ్టు వచ్చిందేమోనని ఆమె వెళ్లిపోయారు. అంతే కిందకి జారిపడ్డారు. లిఫ్ట్ బాక్స్ పై పడి, తీవ్రంగా గాయపడ్డారు.

స్థానికులు చూసి వాసంతిని తిరుపతిలోని స్విమ్స్​కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. అపార్ట్మెంట్​లో లిఫ్ట్ పనితీరు సరిగా లేదని ఫిర్యాదు చేసినా యజమాని పట్టించుకోలేదని మృతురాలి భర్త సురేంద్రరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై తిరుపతి తూర్పు​ పోలీసులు అపార్ట్మెంట్ యజమానిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:

తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు

ABOUT THE AUTHOR

...view details