ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఆనందయ్యను ఎందుకు నిర్బంధించారో అర్థం కావట్లేదు: నారాయణ

By

Published : May 30, 2021, 3:18 PM IST

కృష్ణపట్నం ఆనందయ్యను నిర్బంధం నుంచి విడిపించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆనందయ్యను ఎందుకు బలవంతంగా నిర్బంధించిందో అర్థం కావటం లేదన్నారు. సోమవారం హైకోర్టును ఆశ్రయించి ఈ విషయాన్ని ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకువెళతామని స్పష్టం చేశారు.

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్యను నిర్బంధం నుంచి విడిపించి, స్వేచ్ఛ కల్పించాలని కోరుతూ... హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. తిరుపతి సీపీఐ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రభుత్వం ఆనందయ్యను ఎందుకు బలవంతంగా నిర్బంధించిందో అర్థం కావటం లేదన్నారు. ఆనందయ్య 30 ఏళ్ల నుంచి వనమూలికలతో వైద్యం చేస్తున్నారన్న నారాయణ... ఆయన ప్రజలతో మాట్లాడే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.

కార్పొరేట్ మాఫియా కోసమే ప్రభుత్వం ఆనందయ్యను కిడ్నాప్ చేసిందని నారాయణ ఆరోపించారు. ఆనందయ్య మందుకు అనుమతులు వచ్చే అవకాశమే కనిపించటం లేదన్నారు. సోమవారం హైకోర్టును ఆశ్రయించి ఈ విషయాన్ని ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకువెళతామని నారాయణ స్పష్టం చేశారు.

ఇదీ చదవండీ... CM Jagan: 'మేనిఫెస్టో హామీల్లో 94శాతం పూర్తి చేశాం'

ABOUT THE AUTHOR

...view details