కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తితిదే ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. తిరుమలకు వచ్చే భక్తులను అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద థర్మల్ స్క్రీనింగ్ చేసిన తరువాతనే దర్శనానికి అనుమతిస్తుంది. అక్కడే వాహనాలను తనిఖీ చేసి రసాయనాలతో శుద్ధిపరుస్తున్నారు. అంతేకాకుండా తిరుమల కొండపై... శ్రీవారి ఆలయ పరిసరాలను నిత్యం రసాయనాలతో శుభ్రపరుస్తున్నారు. కంపార్ట్‌మెంట్లలో భక్తులు గుంపుగా ఉండేందుకు ఆస్కారం ఇవ్వకుండా టైంస్లాట్ విధానం ద్వారా శ్రీవారి దర్శనం కల్పించేందుకు చర్యలు ప్రారంభించారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆరోగ్యవంతులుగా ఉండాలని ఆకాంక్షిస్తూ... లోక కల్యాణంకోసం తితిదే పలు యాగాలను చేయిస్తోంది.
కరోనాపై తితిదే తీసుకుంటున్న జాగ్రత్తలేంటి?
ప్రపంచాన్ని భయపెడుతోన్న కరోనా.... ప్రస్తుతం భారత్‌లోనూ విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా 100కు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో తితిదే అప్రమత్తమైంది. కరోనా నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతోంది. వీటితోపాటు ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక యాగాలను సైతం నిర్వహిస్తోంది.
tirumala ttd