ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జగన్ తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారేమో..? - ELEVTIONS

రాష్ట్రంలో తామే గెలుస్తామంటూ వైకాపా నేతలు భ్రమచెందుతున్నారని తుడా ఛైర్మన్ నరసింహ యాదవ్ విమర్శించారు. సర్వేలన్ని తెదేపా గెలుపునకు అనుకూలంగా వస్తున్నాయని అన్నారు. మే 24 జగన్....తెలంగాణ సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తారేమోనని వ్యాఖ్యానించారు.

తుడా ఛైర్మన్ నరసింహ యాదవ్

By

Published : Apr 25, 2019, 5:18 PM IST

తుడా ఛైర్మన్ నరసింహ యాదవ్

రాష్ట్రంలో తమదే గెలుపు అంటూ వైకాపా నేతలు కలలు కంటున్నారని తుడా ఛైర్మన్ నరసింహ యాదవ్ విమర్శించారు. సర్వేలన్ని తెదేపా గెలుస్తున్నాయని చెబుతుంటే... వైకాపా నేతలు తామే గెలుస్తామంటు భ్రమ చెందుతున్నారని అన్నారు. మే 24న ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పిన జగన్.... తెలంగాణలో చేస్తారేమోనని అనుమానంగా ఉందని అన్నారు. జగన్​కు పరోక్ష మద్దతు తెలిపిన కేసీఆర్​ను, పదవి చిత్తుడిని చేసి జగన్ తెలంగాణ ముఖ్యమంత్రి అవుతారేమోనని ఎద్దేవా చేశారు.


రాజ్యాంగాన్ని ప్రశ్నార్థకం చేసేదిగా దేశంలో ఎన్నికలు...?

రాజ్యాంగాన్ని ప్రశ్నార్దకంగా చేసే విధంగా భారతదేశంలో ఎన్నికల జరుగుతున్నాయని తిరుపతి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ ఛైర్మన్ నరసింహ యాదవ్ అన్నారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ప్రస్తుత ఎన్నికల కమీషన్ విధుల్లో మోదీ జోక్యం చేసుకోవడం దారుణమని వ్యాఖ్యానించారు. ఎన్నికలు జరిగిన తీరుపై విమర్శలు వస్తుంటే... ఎన్నికల కమీషన్ నిర్వహించిన సమావేశంలో, ఏపీసీఎస్ పాల్గొనడం సరికాదన్నారు. తెదేపా గెలుపు ఖాయమని అన్ని సర్వేలు చెబుతుంటే.. వైకాపా మాత్రం పగటి కలలు కంటుందని అన్నారు.

ఇవీ చదవండి..సమీక్ష చేయొద్దనే అధికారం ఎవరికీ లేదు

ABOUT THE AUTHOR

...view details