తిరుమల తిరుపతి దేవస్థానం వేద పాఠశాలల్లో ప్రవేశాలకు గడువును పొడిగించింది. 2021-22 విద్యాసంవత్సరానికి గాను అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకునే గడువును ఈనెల 15 వరకు పొడిగించినట్లు ప్రకటించింది. తిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం, రంగారెడ్డి జిల్లాలోని కీసరగుట్ట, పశ్చిమగోదావరి జిల్లాలోని ఐ. భీమవరం, విజయనగరం, నల్గొండ, గుంటూరు జిల్లా కోటప్పకొండ వేద పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరిస్తున్నట్లు తెలిపారు.
వైదిక సాంప్రదాయం ప్రకారం ఉపనయనం పూర్తై.. నిర్ణీత వయస్సు, విద్యా ప్రమాణాలు కలిగిన వారు ఇందుకు అర్హులుగా తితిదే పేర్కొంది. వివిధ కోర్సుల వివరాలు, అర్హత మరియు దరఖాస్తు ఫారం ఇతర వివరాలకు www.tirumala.org వెబ్‌సైట్‌ను సంప్రదించవలసిందిగా ఔత్సాహిక విద్యార్థులకు సూచించింది.