ఈటీవీ భారత్: దేశంలో 55 కేంద్రాలకు ప్లాస్మా థెరపీ చేసేందుకు ఐసీఎమ్‌ఆర్ అనుమతులు ఇవ్వగా...రాష్ట్రంలో తిరుపతి స్విమ్స్‌కు అరుదైన అవకాశం దక్కింది. అనుమతులు సాధించడంలో ఐసీఎమ్‌ఆర్‌తో ఎలాంటి సంప్రదింపులు జరిగాయి?
ఐసీఎమ్‌ఆర్ కన్వల్సన్ ప్లాస్మాథెరపీ క్లినికల్ ట్రైల్ కోసం దేశ వ్యాప్తంగా దరఖాస్తులు ఆహ్వానించింది. స్విమ్స్ ఆసుపత్రికి ఉన్న ఎథికల్ కమిటీ క్లియరెన్స్ పెట్టి మేము దరఖాస్తు చేశాం. పరిశీలన, వివిధ స్థాయిల్లో సంప్రదింపుల తర్వాత అనుమతి లభించింది. గతంలోనే ప్లాస్మా సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఉండటంతో ప్లాస్మా సేకరించి పెట్టాం. మా దగ్గర ఉన్న కరోనా బాధితులకు అవసరమైతే ప్లాస్మా ద్వారా చికిత్స అందించేదుకు ఐసీఎమ్‌ఆర్ అనుమతించింది.
----డాక్టర్ వెంగమ్మ
ఈటీవీ భారత్: ఇప్పటి వరకు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి, స్విమ్స్ ఆసుపత్రులకు మాత్రమే ప్లాస్మా సేకరణకు అనుమతులు ఉన్నాయి. ప్లాస్మా చికిత్సకు ఒక స్విమ్స్ ఆసుపత్రికి మాత్రమే అనుమతి వచ్చింది. చికిత్స తీరు, రోగుల ఎంపిక ఎలా జరుగుతుంది?
ప్లాస్మా చికిత్సకు అనుమతి ఉన్న ఆసుపత్రుల్లోని రోగుల్లో మోడరేట్ డిసీజ్ ఉన్నవారు శాచురేషన్ 93 కన్నా తక్కువ ఉంటూ రెస్పిరేటరీ రేటు ఎక్కువ ఉన్న వారి జాబితా సిద్ధం చేస్తాం. ఒక గ్రూపునకు ప్లాస్మా థెరపీ ఇస్తారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడిమాలజీ ద్వారా ర్యాండమైజేషన్ నంబర్లు వస్తాయి. ముగ్గురు రోగులు ఉంటే ఏ రోగికి చికిత్స ఇవ్వాలి. ఎవరు కంట్రోల్ గ్రూపులో ఉండాలన్నది వారు నిర్ణయిస్తారు. ప్లాస్మా ఇవ్వాలంటే నిబంధనల మేరకు ప్లాస్మా 200 మిల్లీ లీటర్లు ఇవ్వాలి. మోడరేట్ డిసీజ్‌కు మాత్రమే ఇవ్వాలి. షాక్‌లో ఉన్న వారు ఇవ్వకూడదని కచ్చితమైన నిబంధనలు ఉన్నాయి. ----డాక్టర్ వెంగమ్మ
ఈటీవీ భారత్: ఇప్పటి వరకు ఎంతమంది నుంచి ప్లాస్మా సేకరించారు. ప్లాస్మా థెరపీకి అవసరమైన రోగులు ఉన్నారా?
ప్లాస్మా సేకరణకు కూడా ప్రాధాన్యత అంశాలు ఇచ్చారు. పురుషులు 18 ఏళ్లు దాటాలి. బరువు 55 కేజీలు పైబడి ఉండాలి. కొవిడ్ పాజిటివ్ లక్షణాలు ఉండి.. 28 రోజులు గడిచాక రెండు రోజులు వ్యవధితో పీసీఆర్ పరీక్షలు నిర్వహించి నెగిటివ్ ఉంటే వారి నుంచి ప్లాస్మా సేకరించాలి. ఇన్‌క్లూషన్, ఎక్స్‌క్లూజన్ క్రైటీరియా ఇచ్చారు. అలాగే ప్లాస్మా ఇవ్వడానికి రోగులకు ఇన్‌క్లూషన్, ఎక్స్‌క్లూజన్ క్రైటీరియా పెట్టారు. దాదాపుగా ఎనిమిది మంది నుంచి సేకరించాం. వారిలో ఐదు మంది క్రైటీరియా పరిధిలో ఉన్నారు. కరోనా బాధితులు ఇద్దరు, ముగ్గురు మోడరేట్ ఉన్నారు. .... డాక్టర్ వెంగమ్మ
ఈటీవీ భారత్: ప్లాస్మా థెరపీ ఇవ్వడానికి అవసరమైన నిపుణులు స్విమ్స్ ఆసుపత్రిలో ఆందుబాటులో ఉన్నారా...శిక్షణ ఏమైనా ఇస్తున్నారా?