తిరుమల శ్రీవారి దర్శనం మంగళవారం 6 గంటలు పాటు నిలిచిపోనుంది. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆలయ శుద్ధిలో భాగంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని తితిదే నిర్వహించనుంది. వేకువజామున 3 గంటలకు సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి, తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం తర్వాత ఉదయం 6 గంటల నుంచి శుద్ధి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులు నీటితో శుద్ధి చేసిన తర్వాత ఆలయం అంతటా సంప్రోక్షణం చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుంచి శ్రీవారి దర్శనం ప్రారంభమవుతుంది. అష్టాదళ పాదపద్మారాధన సేవను తితిదే రద్దు చేసింది.
శ్రీవారి దర్శనం ఆరు గంటల పాటు నిలిపివేత - శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు
తిరుమలలో ఉదయం 6 గంటల నుంచి శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అందున మధ్యాహ్నం 12 గంటల వరకు దర్శనం నిలిచిపోనుంది.
శ్రీవారి దర్శనం ఆరు గంటల పాటు నిలిపివేత
TAGGED:
తిరుమల శ్రీవారి దర్శనం