Three Floors Building Collapse in Tirupati: తిరుపతి నగరం నడిబొడ్డున ఉన్న భవానీనగర్‌లో పాత భవనం కూలిన ఘటన స్థానికులను భయాందోళనలకు గురి చేసింది. ప్రాచ్య కళాశాల సమీపంలో 60 ఏళ్ల క్రితం నిర్మించిన 3 అంతస్తుల భవనం రాత్రి ఒక్కసారిగా కుప్పకూలింది. అయితే భవనం శిథిలావస్థకు చేరడంతో 2 ఏళ్ల క్రితం యజమానులు ఖాళీ చేశారు.
ఇటీవల కురుస్తున్న వర్షాల నేపథ్యంలో శిథిలావస్థలో ఉన్న భవనం.. ఒక్కసారిగా భారీ శబ్ధంతో కుప్పకూలడంతో(building collapse at tirupati) స్థానికులు భయపడ్డారు. ఆ భవనం చుట్టూ నాలుగైదు అంతస్తుల భవనాలు ఉండగా... వాటిలో నివసిస్తున్న వారంతా పరుగులు తీశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం లేకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కుప్పకూలిన భవనం యజమాని ఎంజీ శ్రీనివాసన్.. తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో అర్చకులుగా పనిచేస్తున్నట్లు స్థానికులు తెలిపారు.