తిరుమల శ్రీవారి సర్వదర్శనం టికెట్లు తితిదే అన్‌లైన్‌లో విడుదల చేసింది. ఉచిత దర్శన టికెట్లు తొలిసారి ఆన్‌లైన్ ద్వారా విడుదల చేశారు. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం.. ఇతర సేవా టిక్కెట్ల మాదిరిగానే సర్వదర్శనం టిక్కెట్లను కూడా తితిదే వెబ్‌సైట్ ద్వారా పొందేలా సౌకర్యం కల్పిచారు. రోజుకు 8 వేల టికెట్ల చొప్పున తితిదే వెబ్‌సైట్‌లో విడుదల చేయనున్నారు. రేపటి నుంచి అక్టోబర్ నెలకు సంబంధించిన కోటా విడుదల చేశారు. తొలిసారి వర్చువల్ క్యూ పద్ధతి ద్వారా టికెట్లు విడుదల చేశారు. సర్వర్లపై ఒత్తిడి లేకుండా ఉండేందుకు వర్చువల్ క్యూ అమలు చేశారు. టికెట్ల కోసం ప్రయత్నించే వారికి సమయం కేటాయిస్తారు.
TIRUMALA: ఆన్‌లైన్‌లో శ్రీవారి సర్వదర్శనం టికెట్లు.. అరగంటలోపే ఖాళీ - తిరుమల తాజా వార్తలు
09:01 September 25
తిరుమల శ్రీవారి సర్వదర్శనం టికెట్లు
కరోనా కట్టడి, భక్తుల ఆరోగ్యం దృష్ట్యా ఆన్‌లైన్ విధానం ఎంచుకున్నట్లు తితిదే తెలిపింది. ఆన్‌లైన్ టికెట్ల విడుదలతో ఆఫ్‌లైన్ టోకెన్ల జారీ నిలిపివేసినట్లు స్పష్టం చేసింది. జియో సంస్థ సహకారంతో తితిదే వెబ్‌సైట్ ద్వారా టికెట్లు విడుదల చేస్తోంది. టిక్కెట్లు పొందిన భక్తులు రెండు డోసుల వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ లేదా 72 గంటల ముందు పరీక్ష చేయించుకున్న కొవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్తో తిరుమలకు రావాలని నిబంధనలు విధించింది.
అరగంటలో ఖాళీ..
సర్వదర్శనం టికెట్లు విడుదల చేసిన అరగంటలోపే ఖాళీ అయ్యాయి. ఉదయం 9 గంటలకు టికెట్లు విడుదల చేయగా.. అరగంటలోనే మొత్తం టికెట్లు భక్తులు బుక్ చేసుకున్నారు. అక్టోబర్ 31 వరకు సర్వదర్శనం టికెట్ల జారీ ముగిసింది. 35 రోజుల టికెట్లకు 30 నిమిషాల్లోనే బుకింగ్ పూర్తయ్యింది. 2 లక్షల 88 వేల సర్వదర్శనం టికెట్లు అరగంటలో ఖాళీ అయ్యాయి.
ఇదీ చదవండి: