తిరుపతి ఆర్టీసీ రీజియన్ పరిధిలోని సమస్యలపై సంస్థ ఎండీ సురేంద్రబాబు అధికారులతో చర్చించారు. త్వరలో తిరుపతి నుంచి తిరుమలకు ఎలక్ట్రిక్ బస్సులు నడిపించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో వెయ్యి కొత్త బస్సుల అవసరం ఉందని చెప్పారు. వీటి కొనుగోలుకు బడ్జెట్ కేటాయింపుల నుంచి 650 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరామన్నారు. గత ఏడాదితో పోలిస్తే రాష్ట్రంలో 4 శాతం ఆక్యుపెన్సీ రేషియో పెరిగిందని తెలిపారు. డీజిల్ ధరలు పెరిగిన కారణంగా.. 200 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చిందన్నారు.