చిత్తూరు జిల్లాలో రోజురోజుకీ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. జిల్లాలో రోజుకి సుమారు వెయ్యికి పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అందులో తిరుపతి తొలిస్థానంలో నిలుస్తోంది. రోజుకు సమారు 300 కేసులు నమోదవుతున్నాయి. కొవిడ్ పరీక్షల కోసం వస్తున్న ప్రజలు నీరసించిపోయి, రోడ్డుపైనే కూలబడిపోతున్నారు. ఇటీవల ఓ వ్యక్తి కొవిడ్ పరీక్షలకై తన తండ్రితో క్యూలో నిల్చొని అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
అజాగ్రత్త వద్దు... అప్రమత్తతే మేలు - చిత్తూరు కరోనా వార్తలు
చిత్తూరు జిల్లా తిరుపతిలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తిరుపతి అలిపిరి వద్ద కరోనా నిర్ధరణ పరీక్షలు చేయించుకునేందుకు పెద్ద ఎత్తున ప్రజలు వచ్చారు. వారిలో కొంతమంది మరింత నీరసించి పోయి రోడ్డుపైనా కూర్చుండిపోయారు. అశ్రద్ధ చేయకుండా వ్యాధి లక్షణాలు గుర్తించిన వెంటనే నిర్ధరణ పరీక్షలు చేయించుకుంటే మేలని వైద్యులు సూచిస్తున్నారు.
అజాగ్రత్త వద్దు... అప్రమత్తతే మేలు
ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ప్రజలు నిత్యం వారి శరీరంలో వస్తున్న మార్పులను ముందే గమనిస్తూ, ముందుగా పరీక్షలు చేయించుకుంటే మంచిదని వైద్యులు అంటున్నారు. వ్యాధి తీవ్రమయ్యే వరకూ అశ్రద్ధ చేయొద్దని సూచిస్తున్నారు. అలిపిరి లింక్ బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన సంజీవని కొవిడ్ పరీక్షల బస్సు వద్ద నిల్చోలేక కరోనా అనుమానితులు నేలపై కూలబడిపోయారు.
ఇదీ చదవండి :కరోనా భయం... తీసింది ప్రాణం