ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తిరుపతిలో దారుణం.. ఓ వ్యక్తిని నరికి చంపిన 8 మంది! - తిరుపతి క్రైమ్ న్యూస్

తిరుపతిలో దుండగుల చేతిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడు పాత నేరస్థుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు.

తిరుపతిలో ఓ వ్యక్తిని 8మంది నరికి చంపారు!
తిరుపతిలో ఓ వ్యక్తిని 8మంది నరికి చంపారు!

By

Published : Dec 21, 2019, 11:07 PM IST

తిరుపతిలో ఓ వ్యక్తిని 8మంది నరికి చంపారు!

తిరుపతిలో ఓ వ్యక్తిని దుండగులు అతి కిరాతకంగా నరికి చంపారు. తిరుమల బైపాస్ రోడ్డులోని ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వద్ద ఈ ఘటన జరిగింది బెల్ట్ మురళి అలియాస్ ఆటో మురళి అనే వ్యక్తిని.... అందరూ చూస్తుండగానే 8 మంది వ్యక్తులు నరికి చంపారు. మరో వ్యక్తిపైనా దుండగులు దాడికి పాల్పడగా... అతడు గాయాలతో బయటపడ్డాడు. ఘటనా స్థలానికి చేరుకున్న తిరుపతి తూర్పు పట్టణ పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. మృతుడు మురళి... పాత నేరస్థుడని భావిస్తున్నారు. తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2017లో ఓ హత్య కేసులో ఏ1 ముద్దాయిగా ఉన్న మురళిని.... పాతకక్షలతో హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details