10 ఎలక్ట్రానిక్స్ కంపెనీలకు రేపే శంకుస్థాపన - lokesh
రేపు తిరుపతి ఎలక్ట్రానిక్ తయారీ క్లస్టర్లలో పది ఎలక్ట్రానిక్స్ కంపెనీలకు లోకేశ్ భూమి పూజ చేయనున్నారు.మొత్తం 1,445 కోట్లు విలువైన కంపెనీలు ఏర్పాటు చేయనున్నారు. 7,088 మందికి ఉపాధి లభించనుంది.
రేపు పది ఎలక్ట్రానిక్స్ కంపెనీలకు మంత్రి లోకేశ్ భూమి పూజ చేయనున్నారు. కార్బన్ మొబైల్స్ తయారీ కంపనీని ప్రారంభించనున్నారు. తిరుపతి ఎలక్ట్రానిక్స్ తయారీ క్లస్టర్ -1 లో కార్బన్ కంపనీ ఏర్పాటు చేశారు. మొత్తం 80 కోట్ల పెట్టుబడితో 700 మందికి ఉపాధి లభించనుంది.
మొత్తం 1,445 కోట్ల విలువైన కంపెనీలకు లోకేశ్ భూమి పూజ చేయనున్నారు. 7,088 మందికి ఉద్యోగాలు కల్పించనున్నాయి. ఏసీలు, ఫ్రిజ్‌ల తయారీలో దిగ్గజ సంస్థ వోల్టాస్ సంస్థకు లోకేశ్ శంకుస్థాపన చేయనున్నారు.వోల్టాస్ సంస్థ 653 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ సంస్థ 1,680 మందికి ఉపాధినిస్తుంది. ఎలక్ట్రానిక్స్ తయారీ రెండో క్లస్టర్లో సీసీ కెమెరాలు, టీవీల తయారీ సంస్థ డిక్సన్ 145 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. డిక్సన్ 1131 మందికి ఉద్యోగాలు ఇవ్వనుంది.