ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రబాబు ప్రమాణం - namination

విజయవాడలోని నాలుగో అదనపు సీనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి ఎదుట కుప్పం నియోజకవర్గం నుంచి తెదేపా అభ్యర్థిగా చంద్రబాబు ప్రమాణం చేేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు(ఫైల్)

By

Published : Mar 23, 2019, 3:23 PM IST

సీఎం ప్రమాణం
విజయవాడ సివిల్ కోర్టు కాంప్లెక్స్ ప్రాంగణంలోనినాలుగో అదనపు సీనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి ఎదుట ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణం చేశారు. కుప్పం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా చంద్రబాబు పోటీ చేస్తుండగా.... ఆయన తరఫున నామపత్రాలను కుప్పం తహశీల్దారు కార్యాలయంలో రిటర్నింగ్‌ అధికారికి స్థానిక నేతలు అందజేశారు. రిటర్నింగ్ అధికారి వద్ద అభ్యర్ధి ప్రమాణం చేయాల్సి ఉండగా.. ఎన్నికల ప్రచారంలో తీరికి లేక సీఎం ఈప్రక్రియకు హాజరు కాలేదు. ఈ కారణంతో...ఇవాళ ఎన్నికల ప్రచారానికి బయలుదేరే ముందు ఉండవల్లిలోని నివాసం నుంచి నేరుగా సివిల్ కోర్టుకు వెళ్లారు.న్యాయమూర్తి ఎదుట చంద్రబాబు ప్రమాణం చేశారు.

ABOUT THE AUTHOR

...view details