చెవిరెడ్డిపై అనుచరుల ఫిర్యాదు - chevireddy
చంద్రగిరి వైకాపా ఎమ్మెల్యే నుంచి తమకు ప్రాణ హాని ఉందంటూ ఆయన అనుచరులే అలిపిరి పీఎస్లో ఫిర్యాదు చేశారు.
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి(ఫైల్ పోటో)
చిత్తూరు జిల్లా చంద్రగిరి వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై అలిపిరి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. ఎమ్మెల్యే నుంచి ప్రాణహాని ఉందంటూ ఆయన అనుచరులు నాగభూషణం, సిసింద్రీ, రెడ్డెప్ప, గోపి కుటుంబ సభ్యులు అలిపిరి ఏఎస్పీకి ఫిర్యాదు చేశారు. తనను హత్య చేసేందుకు తన అనుచరులు రెక్కీ నిర్వహిస్తున్నారని రెండు రోజుల క్రితం చెవిరెడ్డి ఆరోపించారు.
Last Updated : Feb 7, 2019, 8:26 PM IST