ఉపఎన్నికలో విజయమే లక్ష్యంగా.. తెదేపా అధినేత చంద్రబాబు చేపట్టిన పర్యటన ఈరోజు తిరుపతిలో కొనసాగనుంది. సాయంత్రం 4 గంటలకు ఆయన తిరుపతికి చేరుకోనున్నారు. రైల్వే స్టేషన్ నుంచి రోడ్ షో నిర్వహించనున్నారు. కర్ణాల వీధి, భేరివీధి మీదుగా కృష్ణాపురం ఠాణా వరకు ఈ ర్యాలీ జరగనుంది. ప్రజలనుద్దేశించి పోలీస్ స్టేషన్ వద్ద చంద్రబాబు ప్రసంగించనున్నారు.
ఈ పర్యటనలో తెదేపా అధినేతతో పాటు ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మి సహా ఇతర సీనియర్ నాయకులు పాల్గొననున్నారు. చంద్రబాబు పర్యటనకు సంబంధించి తెదేపా శ్రేణులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.