CBN Tirupati Tour: అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహోద్యమ బహిరంగసభలో పాల్గొనేందుకు తెదేపా అధినేత చంద్రబాబు తిరుపతి చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయంలో అమరావతి ఐకాస, తెదేపా నేతలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ద్వారా తిరుమల ఆలయానికి చేరుకుని.. శ్రీవారిని దర్శించుకున్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. 5 కోట్ల రాష్ట్ర ప్రజల కోరిక అమరావతేనని అన్నారు. పాదయాత్రలో పాల్గొన్న వారికి మద్దతు ఇచ్చేందుకే తిరుపతికి వచ్చాన్నారు. అమరావతే రాజధానిగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించానని అన్నారు. భావితరాల భవిష్యత్తు కోసం ఒకే రాజధాని ఉండాలన్నారు. అనంతరం తిరుమల నుంచి తిరుపతి బయల్దేరిన చంద్రబాబు..అమరావతి పరిరక్షణ మహోద్యమ సభలో పాల్గొన్నారు.