తిరుమలలో అనంతపద్మనాభస్వామి వత్రాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఘనంగా నిర్వహించింది. శ్రీవారి చక్రత్తాళ్వారును పల్లకీలో ఆలయం నుంచి ఊరేగింపుగా వరాహ పుష్కరిణి చెంతకు తీసుకువచ్చారు. అక్కడ శ్రీవారి సుదర్శన చక్రత్తాళ్వార్లకు అర్చకులు ఆగమోక్తంగా ప్రత్యేక అభిషేకం, పూజలను నిర్వహించారు. అనంతరం పుష్కరిణిలో చక్రస్నానాన్ని నిర్వహించారు. కరోనా కారణంగా ఉత్సవాన్ని ఏకాంతంగా నిర్వహించారు. చక్రస్నానానికి భక్తులను పుష్కరిణిలోనికి అనుమతించలేదు.
తిరుమలలో వైభవంగా అనంతపద్మనాభస్వామి వ్రతం
తిరుమలలో అనంతపద్మనాభస్వామి వత్రం వైభవంగా జరిగింది. శ్రీవారి చక్రత్తాళ్వారును పల్లకీలో ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకువెళ్లి.. చక్రస్నానాన్ని నిర్వహించారు.
తిరుమలలో వైభవంగా అనంతపద్మనాభస్వామి వ్రతం
తిరుమల శ్రీవారిని ఇద్దరు ఎమ్మెల్యేలు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కొలుసు పార్థసారథి, గణబాబు స్వామివారి సేవలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి: