తిరుమలలో నేడు కరీరిష్టి యాగం.. పరిణయోత్సవం
తిరుమలలో నేడు రెండు ఉత్సవాలు జరగనున్నాయి. వర్షాలు కురవాలని కోరుతూ నిర్వహించనున్న కరీరిష్టి యాగం పార్వట మంటపంలో ప్రారంభం కానుంది. పద్మావతి పరిణయోత్సవం రెండో రోజులో భాగంగా అశ్వవాహన సేవ జరగనుంది.
శ్రీవారి క్షేత్రం తిరుమలలో నేటి నుంచి ఐదు రోజుల పాటు కరీరిష్టి యాగం జరగనుంది. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని వరుణ దేవుణ్ని ప్రార్థిస్తూ ఈ యాగం నిర్వహించనున్నారు. పాపవినాశనం రహదారిలోని పార్వేట మండపం వద్ద క్రతువు జరగనుంది. గణపతి పూజతో ప్రారంభించి.. కారీరిష్టి, వరుణజప, అమృతవర్షిణి, విరాట పర్వాల ప్రక్రియ నిర్వహించనున్నారు. మరోవైపు... సోమవారం మొదలైన పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవంలో భాగంగా.. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు అశ్వవాహన సేవ జరగనుంది. ఈ కార్యక్రమాల నేపథ్యంలో తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. 12 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. స్వామి వారి సర్వదర్శనానికి 12 గంటలు.. టైమ్ స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 4 గంటల సమయం పడుతోంది.