రాజమహేంద్రవరం బొమ్మూరులో ఓ బాలికపై అత్యాచారయత్నం, ఆ కుటుంబాన్ని వేధించటంతోనే బాలిక తండ్రి బలవన్మరణానికి ప్రయత్నించారని తెదేపా నిజనిర్థరణ బృందం పేర్కొంది. బాధిత కుటుంబ సభ్యులకు న్యాయం చేయకపోగా వేధింపులకు గురిచేయడం వల్లే బలవన్మరణానికి యత్నించారని కమిటీ బృంద సభ్యులు నాగుల్ మీరా అన్నారు.
'వేధింపులతోనే ఆత్యహత్యకు యత్నించారు'
రాజమహేంద్రవరం బొమ్మూరులో ఓ బాలికపై అత్యాచార యత్నం, వేధింపుల కారణంగానే బాలిక తండ్రి బలవన్మరణానికి ప్రయత్నించారని తెదేపా నిజనిర్థరణ బృందం తెలిపింది. బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ.20 లక్షలు ఆర్థిక సాయం చేయాలని కోరారు.
tdp on rape attempt at bommuru
గత మూడు నెలలుగా బాధితులని ఇబ్బందులకు గురిచేసి.. ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం... పరువునష్టం దావా తదితర కేసులు పెట్టడం దారుణమని సీనియర్ ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి అభిప్రాయపడ్డారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ.20 లక్షలు ఆర్థిక సాయం చేయాలని తెదేపా నిజనిర్ధరణ కమిటీ డిమాండ్ చేసింది.
ఇదీ చదవండి: ఈనెల 8న జరగాల్సిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా