వివాహ పరిచయ వేదికకు విశేష స్పందన - good response for Wedding introductory venue held by eenadu pelli pandiri in rajamahendravaram
రాజమహేంద్రవరంలో నిర్వహించిన వివాహ పరిచయ వేదికకు అధిక సంఖ్యలో వధూవరులు, వారి తల్లిదండ్రులు హాజరయ్యారు. కార్యక్రమ నిర్వహణ తీరును ప్రశంసించారు.
ఈనాడు పెళ్లిపందిరి ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో నిర్వహించిన కాపు, తెలగ వధూవరుల వివాహ పరిచయ వేదికకు మంచి స్పందన లభించింది. వై జంక్షన్ వద్ద ఆనం రోటరీ హాల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి వధూవరులు, వారి తల్లిదండ్రులు హజరయ్యారు. వేదికపై వారి అభిప్రాయాలను వెల్లడించారు. వధూవరుల వివరాలను తెరపై ప్రదర్శించారు. తమ వర్గానికి చెందిన వధూవరులు ఒకేచోట చేరటం వల్ల నచ్చిన సంబంధాలు ఎంచుకునే అవకాశం ఉంటుందని తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు.
TAGGED:
wedding