ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఒక్క హైకోర్టుతోనే రాయలసీమ అభివృద్ధి సాధ్యంకాదు' - latest news on amaravathi

కర్నూలులో హైకోర్టు పెట్టినంత మాత్రాన రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందదని బైరెడ్డి రాజశేఖర్​ రెడ్డి అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారే కానీ రాజధాని మార్చమని ఎవరు అడగలేదన్నారు.

byreddy raja shekar reddy on amaravathi
అమరావతిపై బైరెడ్డి రాజశేఖర్​ రెడ్డి

By

Published : Jan 17, 2020, 4:03 PM IST

రాజధాని మార్చడం వల్ల రాష్ట్రమంతటా ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయని బైరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి ఆరోపించారు. దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి రాజధాని నిర్మించారని... చిన్న పనులు మినహా పరిపాలనకు కావల్సిన అన్ని కార్యలయాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ సమయంలో రాజధాని మార్చడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. హైకోర్టు బెంచిని కర్నూలులో ఏర్పాటు చేయడం వల్ల రాయలసీమకు ఏమీ లాభం లేదన్నారు. రాష్ట్ర ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారు కానీ రాజధాని మార్చమని ఎవరు అడగలేదన్నారు. కాంగ్రెస్ మాజీ ఎంపీ హర్షకుమార్‌ను రాజమహేంద్రవరం కారాగారంలో పరామర్శించిన ఆయన... ఆయనకు బెయిల్‌ రాకుండా ప్రభుత్వం అడ్డుపడుతోందని ఆరోపించారు.

అమరావతిపై బైరెడ్డి రాజశేఖర్​ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details