ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా శిద్దా ఖరారు! - mp
ఒంగోలు ఎంపీ స్థానం విషయంలో సీఎం చంద్రబాబు చాణక్య నీతి ప్రదర్శించారు. వైకాపా నుంచి మాగుంటను బరిలో దింపేందుకు అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో... ఆయన్ని ఎదుర్కొనేందుకు జిల్లాలో మరో బలమైన నేత అయిన శిద్దా రాఘవరావును పోటీలోకి దింపుతున్నారు. ఈ మేరకు మంత్రి శిద్దా పేరును ఎంపీ స్థానానికి ఖరారు చేశారు.
ఒంగోలు ఎంపీ స్థానం నుంచి ఎవరు బరిలోకి దిగుతారనే అంశంపై స్పష్టత వచ్చింది. ఈ స్థానానికి రాష్ట్ర మంత్రి శిద్దా రాఘవరావు పేరును ముఖ్యమంత్రి చంద్రబాబు ఖరారు చేశారు. శిద్దా ఎంపీగా పోటీ చేస్తున్నందున.. దర్శి అసెంబ్లీ నియోజకవర్గ సీటును ఉగ్ర నరసింహారెడ్డికి కేటాయించారు. కనిగిరి మాజీ ఎమ్మెల్యే అయిన నరసింహారెడ్డి... ఈ నెల 2నే కాంగ్రెస్ నుంచి తెదేపాలోకి చేరారు. వైకాపాలోకి చేరనున్న ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులును ఒంగోలు ఎంపీగా పోటీ చేయించాలని జగన్ యోచిస్తున్నారని సమాచారం.