ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

దిల్లీ ఉద్యమంలో మృతిచెందిన అన్నదాతలకు నివాళి

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమానికి భారీగా మద్దతు లభిస్తోంది. ఉద్యమంలో మరణించిన రైతులకు ప్రకాశం జిల్లా అద్దంకిలో శ్రద్ధాంజలి ఘటించారు. నెల్లూరులో ప్రజా సంఘాల ఐక్య వేదిక నివాళి అర్పించింది. విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద పలు పార్టీలు, రైతు, కార్మిక, విద్యార్థి సంఘాల నేతలు నివాళి అర్పించారు.

tribute-to-farmers
అన్నదాతలకు నివాళి

By

Published : Dec 20, 2020, 7:31 PM IST

దిల్లీలోని రైతు ఉద్యమంలో మృతి చెందిన రైతులకు అఖిల భారత కిసాన్ సంఘర్షణ సమితి పిలుపు మేరకు ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలోని భవానీ కూడలి వద్ద నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రైతు, ప్రజా సంఘాలు, వామపక్ష నాయకులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా రైతు సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ నాయకుడు సీహెచ్ గంగయ్య అన్నారు.

నెల్లూరులో...

వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా నెల్లూరులో ప్రజా సంఘాల ఐక్య వేదిక సంఘీభావ దీక్ష చేపట్టింది. నగరంలోని గాంధీబొమ్మ సెంటర్ వద్ద జరిగిన ఈ దీక్షలో రైతు సంఘాలతో పాటు సీపీఐ నాయకులు పాల్గొన్నారు. పోరాటంలో మృతి చెందిన రైతులకు నివాళులర్పించారు. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడి వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రం దిగొచ్చే వరకు పోరాడతామని స్పష్టం చేశారు.

విజయనగరంలో..

దిల్లీలో ఉద్యమం చేస్తూ అశువులు బాసిన అన్నదాతలకు విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద పలు పార్టీలు, రైతు, కార్మిక, విద్యార్థి సంఘాల నేతలు నివాళి అర్పించారు. మృతిచెందిన రైతుల చిత్రపటాలకు పూలమాలలు వేశారు. దిల్లీలో ఎముకలు కొరికే చలిని సైతం లెక్కచేయకుండా ఉద్యమిస్తున్న రైతులకు మద్దతు తెలిపారు. ఇప్పటికీ 34మంది అన్నదాతలు ప్రాణాలు కోల్పోయారని అయినా కేంద్రం స్పందించకపోవటం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

ఆర్ధరాత్రి వేళ ఆలయాల్లో దోపిడీలు

ABOUT THE AUTHOR

...view details