ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'నెల్లూరులో 2.5 లక్షల మొక్కలు' - development

నెల్లూరులో రెండున్నర లక్షల మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకున్నామని మంత్రి నారాయణ తెలిపారు. నగరంలోని 16 డివిజన్లలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు.

నెల్లూరు

By

Published : Mar 3, 2019, 8:07 PM IST

మొక్కలు నాటిన మంత్రి నారాయణ
దేశంలో ఎక్కడాలేని విధంగా నెల్లూరులో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. నగరంలో 650 కిలోమీటర్ల రహదారి నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. రోజుకు ఏడు వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేపడుతున్నామని.. త్వరలో పూర్తి చేసిమొక్కలు నాటిస్తామని చెప్పారు. నగరంలోని 16 డివిజన్లలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. నెల్లూరులో మొత్తం రెండున్నర లక్షల మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో వాటిని సంరక్షిస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details