ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఇద్దరు యువతుల ప్రేమాయణం... ఇంటి నుంచి అదృశ్యం - girls love in kurnool news

ఆ యువతులు ఇద్దరూ చిన్న నాటి నుంచే స్నేహితులు. వయసు వచ్చాక స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఒకరిని విడిచి మరొకరు ఉండలేకనో, తమ ప్రేమను తల్లిదండ్రులు ఒప్పుకోరన్న భయంతోనే ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన కర్నూలులో జరిగింది.

love
love

By

Published : Nov 5, 2020, 3:18 PM IST

అబ్బాయి.. అమ్మాయి ప్రేమించుకోవటం సహజం. కానీ అమ్మాయి.. అమ్మాయి ప్రేమించుకుని పారిపోయిన ఘటన కర్నూలులో జరిగింది. సంతోష్‌నగర్‌ ప్రాంతానికి చెందిన యువతి (21), నర్సింహారెడ్డినగర్‌కు చెందిన మరో యువతి (20) చిన్ననాటి నుంచే స్నేహితులు. అలా వారిద్దరి మధ్య స్నేహం ప్రేమ బంధంగా మారింది.

'మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. మేము ఇంటి నుంచి వెళ్లిపోతున్నాం' అంటూ ఈ నెల 3వ తేదీన వారిద్దరూ తల్లిదండ్రులకు సంక్షిప్త సమాచారం పంపి అదృశ్యమయ్యారు. చుట్టు పక్కల గాలించినా ఫలితం లేకపోవటంతో ఇరువురి తల్లిదండ్రులు కర్నూలు రెండో పట్టణ పోలీసుస్టేషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ మహేశ్వర రెడ్డి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details