ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Children Missing: గల్లంతైన ముగ్గురు విద్యార్థుల మృతదేహాలు లభ్యం

By

Published : Oct 28, 2021, 8:34 AM IST

Updated : Oct 28, 2021, 10:33 AM IST

అల్లూరులో నిన్న సాయంత్రం నుంచి కనిపించకుండాపోయిన ముగ్గురు విద్యార్థులు మృత్యవాతపడ్డారు. సాయంత్రం ఆడుకునేందుకు వెళ్లి కుంటలో పడి మృతి చెందారు. ఇవాళ ఉదయం గాలించిన పోలీసులు..మూడు మృతదేహాలను వెలికితీశారు.

1
1

కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం అల్లూరులో విషాదం నెలకొంది. నిన్న సాయంత్రం గల్లంతైన ముగ్గురు విద్యార్ధుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఎస్సీ ప్రభుత్వ ప్రత్యేక బడిలో చదువుతున్న శరత్‌(10), మహేశ్‌(10), విశాల్‌(9)లు.. బుధవారం సాయంత్రం పాఠశాల ముగిసిన తర్వాత ఇంటి నుంచి బయటకు వెళ్లారు. వ్యవసాయ పనులు ముగించుకొని ఇంటికొచ్చిన తల్లిదండ్రులకు పిల్లలు కనిపించకపోవడంతో భయాందోళనకు గురైన.. గ్రామస్థులతో కలిసి వెతికారు. ఎంతకూ ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఊరి చివరన ఉన్న నీటికుంట వద్దకు వెళ్లారు. ఒడ్డున ముగ్గురు పిల్లల దుస్తులు కనిపించాయి.

రాత్రి కావడంతో కుంటలో గాలించేందుకు వీలు కాలేదు. ఇవాళ ఉదయం పోలీసులు మృతదేహాలను వెలికితీశారు.

Last Updated : Oct 28, 2021, 10:33 AM IST

ABOUT THE AUTHOR

...view details