వర్షాల కోసం ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు - namaz
వర్షాలు సమృద్ధిగా కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుతూ... కర్నూలు ఈద్గాలో ముస్లింలు ప్రత్యేక నమాజ్ చేశారు. మూడు రోజుల పాటు ఈ ప్రార్థనలు చేయనున్నారు.
వర్షాల కోసం కర్నూల్లో ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు
వర్షాలు కురవాలని కర్నూలులో ముస్లింలు ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. నగరంలోని పాత ఈద్గాలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో.. ముస్లింలు పెద్ద సంఖ్యలో పాల్గొని అల్లాను ప్రార్థించారు. ఈ ప్రత్యేక నమాజ్ కార్యక్రమాన్ని మూడు రోజుల పాటు నిర్వహించనున్నట్లు ముస్లిం మత పెద్దలు తెలిపారు. కర్నూలుకు ఎన్నడూ లేనివిధంగా నీటి కొరత వచ్చిందని.. అల్లా దయతో వర్షాలు కురిసి అందరు బాగుండాలని ఆకాంక్షించారు.