కరోనా పాజిటివ్ కేసులు రాష్ట్రంలో కర్నూలు జిల్లాలోనే ఎక్కువగా నమోదు కావడంతో అధికారులు లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. జిల్లాలో కరోనా కేసులు నమోదైన ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించారు. ఆయా ప్రాంతంలో రాకపోకలు నిలిపివేశారు. ఈ క్రమంలో నిత్యావసర వస్తువుల విక్రయాలను కర్నూలుకు 5 కిలోమీటర్ల దూరానికి తరలించారు. దీనివల్ల నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారుల అనుమతి లేకుండా నగరంలో అక్కడక్కడా కొందరు వ్యాపారులు కూరగాయలు విక్రయాలు నిర్వహిస్తుండగా కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబు వారిని అక్కడి నుంచి పంపించివేశారు. కురగాయలు లేక ఇబ్బందులు పడుతున్నామని... వాటిని నగరంలోనే విక్రయించాలని స్థానికులు కోరుతున్నారు.
కూరగాయల కోసం 5 కిలోమీటర్లు వెళ్లాలి
కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా కూరగాయల మార్కెట్‌ను కర్నూలుకు 5 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేశారు అధికారులు. అంత దూరం వెళ్లలేక నగరవాసులు ఇబ్బందిపడుతున్నారు. నగరంలోనే ఎక్కడైనా మార్కెట్‌ను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
vegetable markets