విత్తనం నుంచి విక్రయం దాకా దగాపడ్డ రైతన్న పేరుతో నేడు విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తెదేపా... పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టనుంది. ఐదు జిల్లాల తెలుగు రైతు సంఘం నాయకులు, పార్టీ ముఖ్య నేతలు ఈ ఆందోళనల్లో పాల్గొననున్నారు. సీఎం జగన్ 32 నెలల పాలనలో రైతులకు కలిగిన ప్రయోజనం శూన్యమని తెదేపా నేతలు ఆరోపించారు. పంటలకు గిట్టుబాటు ధర, సున్నా వడ్డీ రుణాలు, పంట బీమా, ఇన్ పుట్ సబ్సిడీ అమలులో జగన్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. వరుసగా రెండో ఏడాది రైతు ఆత్మహత్యల్లో మూడో స్థానం, కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో రాష్ట్రం నిలవటంపై తెలుగుదేశం ఆందోళన వ్యక్తం చేసింది.
TDP : '32నెలల జగన్ పాలనలో రైతులకు కలిగిన ప్రయోజనం శూన్యం' - TDP leaders protest
నేడు పలు జిల్లాల్లో తెదేపా ఆధ్వర్యంలో "విత్తనం నుంచి విక్రయం దాకా దగాపడ్డ రైతన్న" పేరుతో నిరసనలు చేపట్టనున్నారు. 32 నెలల జగన్ పాలనలో రైతులకు కలిగిన ప్రయోజనం శూన్యమని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెదేపా నిరసనలు