ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎస్ఈబీ అధికారుల దాడులు.. మూడు వేల లీటర్ల బెల్లం ఊట ధ్వంసం

గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎస్​ఈబీ అధికారులు దాడులు నిర్వహించారు. బెల్లం ఊటతో పాటు.. రెండు సారా బట్టీలను ధ్వంసం చేశారు. సారా బట్టీలు నిర్వహిస్తున్న వ్యక్తులు పరారీలో ఉన్నారని.. వారికోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

illegal liquor raids
illegal liquor raids

By

Published : May 1, 2021, 10:47 PM IST

ఎస్ఈబీ అధికారులు.. గుంటూరు జిల్లాలోని పలు గ్రామాల్లోని సారా బట్టీలపై దాడులు నిర్వహించారు. మూడు వేల లీటర్ల బెల్లం ఊటతో పాటు.. రెండు బట్టీలను ధ్వంసం చేశారు. తమను గుర్తించి సారా తయారీదారులు పరారయ్యారని.. అనుమానితులపై నిఘా ఉంచి విచారణ చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. సారా తయారీకి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం మురారిలో సారా బట్టీలపై పోలీసులు దాడులు నిర్వహించారు. పద్దెనిమిది వందల లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసారు. 5 లీటర్ల సారాతో పాటు.. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొన్నారు

ఇదీ చదవండి:ధూళిపాళ్లను 5 గంటలపాటు ప్రశ్నించిన అనిశా అధికారులు

ABOUT THE AUTHOR

...view details