కాకినాడలో జనసేన కార్యకర్తలపై వైకాపా శ్రేణులు రాళ్లదాడి చేయడంపై జనసేనాని పవన్ మండిపడ్డారు. వైకాపా ఎమ్మెల్యే అసభ్యకర వ్యాఖ్యలను అందరూ తప్పుబడుతున్నారన్నారు. రెచ్చగొట్టే రీతిలో వ్యవహరించిన నేతపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పవన్ డిమాండ్ చేశారు. పోలీసులు ఇరువర్గాలతో చర్చించి శాంతియుత పరిస్థితులు తేవాలని సూచించారు. తమ పార్టీ శ్రేణులను ఇబ్బందిపెడితే దిల్లీ నుంచి నేరుగా కాకినాడ వస్తానని పవన్ హెచ్చరించారు. రాళ్ల దాడిలో గాయపడిన జనసైనికులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
'అరాచక శక్తులతో దాడి చేయిస్తే వెనుకడుగు వేస్తాం అనుకోవద్దు' - కాకినాడలో వైసీపీ జనసేన మధ్య గొడవ న్యూస్
తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్లదాడి చేయడాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఖండించారు. అరాచక శక్తులతో దాడి చేయిస్తే వెనకడుగు వేస్తారనుకోవద్దని స్పష్టం చేశారు.
janasena and ysrcp activists attack and words war