ETV Bharat Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

AP TOP NEWS : ప్రధాన వార్తలు @ 11AM - ప్రధాన వార్తలు

.

top news
top news
author img

By

Published : Jan 15, 2022, 11:00 AM IST

  • FISH LADDER IN POLAVARAM: పోలవరంలో జీవవైవిధ్యం.. ఫిష్ ల్యాడర్ నిర్మాణం పూర్తి
    Polavaram Project: దేశంలోని బృహత్తర ప్రాజెక్టుల్లో ఒకటైన పోలవరంలో ఓ ప్రత్యేక నిర్మాణం పూర్తైంది. ఫిష్ ల్యాడర్‌గా పిలిచే ఈ నిర్మాణం వల్ల గోదావరిలోని జీవజాలం, చేప జాతులు ఎగువ-దిగువ ప్రాంతాలకు స్వేచ్ఛగా సంచరించే అవకాశం ఉంటుంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • Diamond crown to Lord Ayyappa: శబరిమల అయ్యప్పకు..కర్నూలు వాసి వజ్రాల కిరీటం ప్రదానం
    Andhra devotee presents diamond crown to Lord Ayyappa: కర్నూలు జిల్లాకు చెందిన ఓ అయ్యప్ప భక్తుడు.. శబరిమల అయ్యప్ప స్వామికి వజ్రాల కిరీటాన్ని విరాళంగా అందజేశారు. నంద్యాలకు చెందిన మారం వెంకటసుబ్బయ్య.. శుక్రవారం అరుదైన వజ్రాలు పొదిగిన కిరీటాన్ని శబరిమల ఆలయ ప్రధాన అర్చకుడికి అందజేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • Software Cockfight : ఒకప్పుడు వద్దన్నవాళ్లే..లాభాలు చూసి సహకరిస్తున్నారు
    Hens business: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం మనుషులను సొంతూళ్లకే కాదు సంప్రదాయ వ్యాపకాలకు దగ్గర చేస్తోంది. వ్యవసాయం, చేతిపనులు, స్థానిక ఉద్యోగాలు, వ్యాపారాలు వీటన్నిటిని కాదనుకుని సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాల కోసం వేల కిలోమీటర్లు యువత వలస వెళ్తున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • దేశంలో కరోనా ఉపద్రవం- ఒక్కరోజే 2.68లక్షల కరోనా కేసులు
    Covid cases in India: భారత్​లో కొత్త కరోనా కేసులు అమాంతం పెరిగాయి. మరో 2,68,833 మందికి వైరస్​ సోకింది. వైరస్​తో 402 మంది మరణించారు. 1,22,684 మంది కొవిడ్​ను జయించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • 'ఆమెపై గ్యాంగ్​రేప్​ జరగలేదు.. కానీ జననాంగాలపై తీవ్ర గాయాలు!''
    Alwar Rape case: ప్రస్తుతం మీడియాలో ప్రచారం జరుగుతున్నట్టు రాజస్థాన్​ అల్వర్​లో 14 ఏళ్ల దివ్యాంగ బాలికపై సామూహిక అత్యాచారం జరగలేదని పోలీసులు స్పష్టం చేశారు. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఈ విషయాన్ని వెల్లడించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • Challenges For ISRO: మరింత ఉన్నత కక్ష్యలోకి.. ఇస్రో
    Challenges For ISRO: మళ్లీమళ్లీ ఉపయోగించగల స్పేస్‌ షటిల్‌ కల నెరవేరేదాకా విశ్రమించడం తగదన్నది డాక్టర్‌ అబ్దుల్‌ కలాం నిర్దేశం. ఈ ఏడాది ఆదిత్య ఎల్‌1 ప్రాజెక్టుతోపాటు, గగన్‌యాన్‌కు సంబంధించి తొలి మానవ రహిత ప్రయోగం చేపట్టాలని భారత రోదసి పరిశోధన సంస్థ ఉరకలెత్తుతోంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • పాక్​ కొత్త జాతీయ భద్రత విధానం- చరిత్రలో తొలిసారి పౌరులకు ప్రాధాన్యం
    Pakistan National Security Policy: గతంలో సైనిక సామర్థ్యాలు పెంచుకోవడంపై ఎక్కువగా దృష్టి పెట్టిన పాకిస్థాన్‌.. చరిత్రలో తొలిసారి దేశ పౌరుల ప్రగతి ధ్యేయంగా జాతీయ భద్రతా విధానాన్ని రూపొందించింది. జాతీయ భద్రతా కమిటీ (ఎన్‌ఎస్‌సీ)తో పాటు పాక్‌ కేబినెట్‌ గత నెల ఈ విధానానికి ఆమోదం తెలిపింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • 'ఆన్​లైన్​ యాడ్స్​ కోసం కుమ్మక్కైన సుందర్​, మార్క్​​!'
    Google FB Secret Deal: ఆన్​లైన్ యాడ్ సేల్స్​ కోసం దిగ్గజ టెక్ సంస్థలైన గూగుల్, ఫేస్​బుక్​ కుమ్మక్కయ్యాయంటూ అమెరికా కోర్టులో వ్యాజ్యం దాఖలైంది. రెండు సంస్థల సీఈఓలకు ఈ రహస్య ఒప్పందం గురించి పూర్తిగా తెలుసని అనేక రాష్ట్రాల అటార్నీ జనరళ్లు ఆ వ్యాజ్యంలో పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • టీమ్​ఇండియా విచిత్రమైన రికార్డు.. టెస్టులో 20 వికెట్లు క్యాచ్​ అవుట్​లే
    IND vs SA: ఒక్క టెస్టు మ్యాచ్​లో మొత్తం 20 వికెట్లు.. అన్నీ క్యాచ్​ అవుట్లే.. ఇది ఎక్కడైనా జరుగుతుందా..? అని సందేహిస్తున్నారా..? దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్​లో భారత్​కు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. మూడో టెస్టులో మొత్తం 20 వికెట్లు క్యాచ్​ల ద్వారా కోల్పోయి.. నయా రికార్డు నెలకొల్పింది టీమ్​ఇండియా.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • పండగ వేళ కొత్త సినిమాల జోష్.. పోస్టర్లే పోస్టర్లు
    2022 sankranti: సంక్రాంతి పండగ సందర్భంగా తెలుగు సినిమాల కొత్త పోస్టర్లు కళకళలాడుతున్నాయి. సినిమాలపై ఆత్రుతను పెంచేస్తున్నాయి. ఇంతకీ ఆ పోస్టర్లు ఏంటంటే? పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details