కడప జిల్లా రైల్వేకోడూరులోని నరసరాంపేటలో భారీ వర్షాలకు రెండంతస్తుల భవనం కుప్పకూలింది. పది రోజులుగా కురుస్తున్న వానలకు గుంజన ఏరు ఉద్ధృతంగా(Water flow of Gunjana stream) ప్రవహిస్తోంది. దీంతో భూమి భారీగా కోతకు గురై రెండంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో ఇంకా ఎన్ని నివాసాలు కూలుతాయోనని ఆందోళన చెందుతున్నారు. 30 సంవత్సరాలుగా గుంజన ఏరు చుట్టుపక్కలా రక్షణ గోడ నిర్మించాలని కోరినా అధికారులు స్పందించలేదని కన్నీటి పర్యంతమయ్యారు.