కరోనా వైరస్ వ్యాప్తి నివారణ కోసం కొనసాగుతున్న లాక్డౌన్ 19వ రోజుకు చేరుకుంది. కడపలో లాక్డౌన్ పటిష్టంగా అమలవుతున్నప్పటికీ.. వాహనదారులు ఏదో ఒక పని నిమిత్తం రోడ్లపైకి వస్తూనే ఉన్నారు. పోలీసులు వారికి పలు విధాలుగా అవగాహన కల్పిస్తున్నారు. మాస్కులు లేకుండా రోడ్లపైకి వస్తున్న వారికి ట్రాఫిక్ పోలీసులు దగ్గరుండి మాస్కులు అందజేశారు. అనవసరంగా రోడ్లపై తిరగవద్దని సూచించారు. వైరస్ వ్యాప్తి నివారణకు పోలీసులకు సహకరించాలని కోరారు.
'కరోనా వ్యాప్తి నివారణలో పోలీసులకు సహకరించండి'
కరోనా వ్యాప్తి నివారణలో ప్రజలు సహకరించాలని కడప పోలీసులు కోరారు. నగరంలో లాక్డౌన్ పటిష్టంగా అమలవుతున్నప్పటికీ.. వాహనదారులు బయటకు వస్తూనే ఉన్నారు. దీనిపై స్పందించిన పోలీసులు ప్రజలు నిబంధలను పాటించాలని సూచించారు. లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కరోనా వ్యాప్తి నివారణలో పోలీసులకు సహకరించండి