నివర్ ప్రభావంతో కురిసిన వర్షాలతో కడప నగరం అతలాకుతలం అయ్యింది. వానలు తగ్గి 4 రోజులు అయినప్పటికీ అక్కడి ప్రజల కష్టాలు ఇంకా తీరలేదు. ఇళ్లలోకి వచ్చిన నీరు, తడిసిన సామగ్రితో ఇబ్బందులు పడుతున్నారు. వాటికితోడు చెత్తాచెదారం, దుర్వాసనతో వ్యాధులు ప్రబలుతాయని జనం భయపడుతున్నారు. తాగునీరు, ఆహారం లేక అవస్థలు పడుతున్నారు. ఇప్పటివరకు ఏ అధికారి తమను పరామర్శించలేదని.. తమ గోడు పట్టించుకోవట్లేదని వాపోయారు.
కడపలో వర్షాలు తగ్గినా తీరని ప్రజల కష్టాలు
నివర్ ప్రభావంతో తడిసి ముద్దయిన కడప నగరవాసులు ఇంకా తేరుకోలేదు. తాగడానికి నీరు, తినడానికి తిండి లేక అవస్థలు పడుతున్నారు. ఇళ్లలోంచి నీరు బయటకు వెళ్లక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కడపలో వర్షాలు తగ్గినా తీరని ప్రజల కష్టాలు