ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Topnews: ప్రధాన వార్తలు @ 3pm - ప్రధాన వార్తలు

.

ప్రధాన వార్తలు @ 3pm
ప్రధాన వార్తలు @ 3pm

By

Published : Sep 30, 2021, 3:01 PM IST

  • జనసేన శ్రమదానం కార్యక్రమాన్ని ఎవరూ అడ్డుకోలేరు: నాదెండ్ల

అక్టోబర్ 2న జరిగే శ్రమదానం కార్యక్రమాన్ని ఎవరూ అడ్డుకోలేరని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ప్రభుత్యం రోడ్ల మరమ్మతులు చేయట్లేదు కాబట్టే తాము ముందుకొచ్చామని అన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • అమరావతి భూముల ఆంశంపై హైకోర్టులో విచారణ వాయిదా

రాజధానికి భూములిచ్చిన కొందరు రైతులకు కౌలు ఇవ్వలేదని హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. ఈ వ్యాజ్యంపై న్యాయస్థానం విచారణ జరిపింది. కొంతమంది రైతులకు కౌలు ఇచ్చి మిగతా వారికి ఇవ్వలేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది వీవీ.లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • Posani : పోసానిపై తాడేపల్లి పోలీసులకు జనసేన కార్యకర్తల ఫిర్యాదు

పోసాని మురళీకృష్ణపై తాడేపల్లి పోలీసులకు జనసేన కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. పవన్ కల్యాణ్, అతని కుటుంబసభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఉపసంఘం సమావేశం

గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఉపసంఘం (Godavari River Ownership Board Subcommittee Meeting) సమావేశమైంది. హైదరాబాద్‌లోని జలసౌధలో జీఆర్‌ఎంబీ ఉపసంఘం భేటీ (grmb subcommittee meeting) అయింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • కాంగ్రెస్​కు గుడ్​బై.. భాజపాలో మాత్రం చేరను: అమరీందర్

పంజాబ్​లో కాంగ్రెస్​ పార్టీకి భారీ షాక్​ తగిలింది. ఊహించినట్లుగానే పార్టీ నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించారు మాజీ సీఎం కెప్టెన్​ అమరీందర్​ సింగ్​. అయితే భాజపాలో చేరట్లేదని, కాంగ్రెస్​ను మాత్రం కచ్చితంగా వీడతానని స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'రహదారులు దిగ్బంధిస్తే సమస్యలు పరిష్కారమవుతాయా?'

జాతీయ రహదారులను దిగ్బంధించడం (highways blocked by protests) సమస్యకు పరిష్కారం కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. రహదారులపై నిరసనలు ఎలా చేపడతారని ప్రశ్నించింది. రోడ్ల దిగ్బంధనంపై దాఖలైన పిటిషన్​ విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • దక్షిణ కొరియాతో కిమ్​ స్నేహగీతం.. అమెరికాపై విమర్శల దాడి!

ఉభయ కొరియాల మధ్య వివాదం కాస్త సద్దుమణిగినట్లు కనిపిస్తోంది. దక్షిణ కొరియాతో మెరుగైన సంబంధాల కోసం సుముఖత వ్యక్తం చేశారు ఉత్తర కొరియా అధినేత కిమ్​ జోంగ్​ ఉన్ (north korea president). శాంతి స్థాపనలో భాగంగా మూసివున్న సరిహద్దులను తెరవనున్నట్లు చెప్పారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • ఆ కంపెనీల ఉద్యోగులకు వర్క్​ ఫ్రం హోం బంద్!

కరోనా కారణంగా చాలా కంపెనీల ఉద్యోగులు ఏడాదిన్నరకుపైగా వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే దేశంలో కరోనా కేసులు (Corona Cases in India) తగ్గుముఖం పడుతున్నాయి. మరి కంపెనీలు త్వరలోనే వర్క్​ ఫ్రం హోం (End to Work form home) తొలగించనున్నాయా? ప్రస్తుత పరిస్థితుల్లో ఆఫీస్​కు తిరిగి వెళ్లేందుకు ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారా? పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • Rupinder Pal Singh Retirement: టోక్యో కాంస్య పతక విజేత రిటైర్మెంట్​

అంతర్జాతీయ హాకీకి తాను వీడ్కోలు పలుకుతున్నట్లు భారత హాకీ క్రీడాకారుడు రూపీందర్​ పాల్​ సింగ్​(Rupinder Pal Singh Retirement) గురువారం ప్రకటించాడు. టోక్యో ఒలింపిక్స్​లో(Tokyo Olympics) కాంస్య పతకం గెలిచిన జ్ఞాపకాలతో తాను రిటైర్మెంట్​ ప్రకటిస్తున్నట్లు తెలిపాడు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • Dhoni movie: ధోనీ.. ధోనీ.. ధోనీ.. ఇప్పటికీ వినిపిస్తూనే ఉంది!

'ధోని: ఏ అన్​టోల్డ్ స్టోరీ'.. మహీ అభిమానులకే కాదు.. సగటు సినీ ప్రేక్షకుడు తన గుండెల్లో దాచుకున్న చిత్రం. ఈ సినిమాలో టైటిల్ రోల్​ పోషించిన సుశాంత్ సింగ్ రాజ్​పుత్(sushant singh rajput movies).. తన నటనతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేశాడు. ఈ చిత్రం విడుదలై గురువారానికి(సెప్టెంబరు 30) ఐదేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలు మీకోసం. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details