Selfie on Goods Train : గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన కటకంశెట్టి సైదారావు కుమారుడు వీరబ్రహ్మం ఇంటర్ వరకూ చదివాడు. ఇంటి వద్దే ఉంటున్న బ్రహ్మం బుధవారం సాయంత్రం పిడుగురాళ్ల రైల్వే స్టేషన్ కు ద్విచక్రవాహనంపై వెళ్లాడు. నడికూడి నుంచి చెన్నై వెళ్లే గూడ్స్ రైలు ఫ్లాట్ ఫాంపై ఆగి ఉంది.గమనించిన వీరబ్రహ్మం గార్డు ఉండే బోగీపైకి ఎక్కి సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు. అతనికి కొద్ది ఎత్తులోనే ఉన్న విద్యుత్ తీగలను గమనించని బ్రహ్మం సెల్ఫీలు దిగుతుండగా...కరెంటు తీగలు తగిలి పడిపోయాడు. ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో గమనించిన సమీపంలోని గొర్రెల కాపరి వచ్చి మంటలార్పి...దుస్తులు తొలగించాడు. తీవ్ర గాయాలపాలైన బ్రహ్మంను రైల్వే పోలీసులు పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.
Selfie on Goods Train :గూడ్సు పైకెక్కి సెల్ఫీకి యువకుడి యత్నం...విద్యుదాఘాతంతో తీవ్రగాయాలు... - Selfie on Goods Train
Selfie on Goods Train :సెల్ఫీ మోజు ప్రాణాల మీదకు తెస్తున్న ఘటనలు నిత్యం ఎక్కడో ఒక చోట వార్తల్లో నిలుస్తున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా పిడుగురాళ్లో కూడా అలాంటి ఘటనే చోటు చేసుకుంది. గూడ్సుపైకెక్కి సెల్ఫీలు తీసుకోబోయిన ఓ యువకుడు విద్యుదాఘాతంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. ఆ వివరాలు...
గూడ్సు పైకెక్కి సెల్ఫీకి యువకుడి యత్నం...విద్యుదాఘాతంతో తీవ్రగాయాలు...
TAGGED:
Selfie on Goods Train