ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రైవేటు కాంట్రాక్ట్ క్యారియర్ బస్సులపై రవాణా శాఖ తనిఖీలు.. - గుంటూరు జిల్లాలో రవాణా శాఖ ప్రత్యేక డ్రైవ్

గుంటూరు జిల్లాలో ప్రైవేటు కాంట్రాక్ట్ క్యారియర్ బస్సులపై రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. నిబంధనలను ఉల్లంఘించిన బస్సులపై కేసులు నమోదు చేశారు. అధిక ధరలు వసూలు చేస్తున్న బస్సులకు జరిమానా విధించారు.

rta raid on private travels in guntur
ప్రైవేటు బస్సులపై రవాణా శాఖ తనిఖీలు

By

Published : Jan 12, 2021, 9:40 PM IST

గుంటూరు జిల్లాలో ప్రైవేటు కాంట్రాక్ట్ క్యారియర్ బస్సులపై రవాణా శాఖ అధికారులు ప్రత్యేక డ్రైవ్ ద్వారా తనిఖీలు చేపట్టారు. గుంటూరు నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్న ప్రైవేటు బస్సుల్లో నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 41 బస్సులపై అధికారులు కేసులు నమోదు చేశారు. పండగ వేళ అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారన్న అభియోగంపై రెండు బస్సులకు రూ. 25వేల చొప్పున జరిమానా విధించిన అధికారులు కేసులు నమోదు చేశారు.

ప్రయాణికుల జాబితా లేని 6 బస్సులు, ఒకే డ్రైవర్​తో నడుపుతున్న 6 బస్సులను గుర్తించి కేసులు నమోదు చేశారు. పండగ వేళ ప్రయాణికులను ఇబ్బందులు పెట్టేలా బస్సు యాజమాన్యాలు వ్యవహరించరాదని.. ఈ దాడులు కొనసాగుతాయని రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ మీరా ప్రసాద్ స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:దొంగగా మారిన కానిస్టేబుల్... ఉన్నతాధికారి ఇంటికే కన్నం !

ABOUT THE AUTHOR

...view details