ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 5, 2021, 7:23 PM IST

Updated : Jun 5, 2021, 8:13 PM IST

ETV Bharat / city

Vaccine passport!: విదేశాలకు వెళ్లాలనుకునే వారి కోసం

ప్రభుత్వ ఆదేశాల మేరకు గుంటూరు జిల్లాలో విదేశీ ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా టీకా పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విదేశాలకు వెళ్లాలని అనుకునే వారికి ప్రత్యేకంగా టీకా పంపిణీ చేపట్టాయి. రాష్ట్ర ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం దీనిపై నిర్ణయం తీసుకుంది. విదేశాలకు వెళ్లే వారు ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే వారికి టీకా అందించే ఏర్పాట్లు చేయాలని ఆయా జిల్లాల అధికారులను ఆదేశించింది. ఇది వ్యాక్సిన్​ పాస్​పోర్ట్​ (Vaccine passport) లాంటిదే.. చాలా దేశాలు వ్యాక్సిన్​ సర్టిఫికెట్​ లేకపోతే ప్రయాణికులను తమ దేశంలోకి అనుమతించడం లేదు. దీంతో స్పెషల్​ వ్యాక్సిన్​ డ్రైవ్​ అవసరమైంది.

Special Vaccine Drive
Special Vaccine Drive

విదేశాలకు వెళ్లాలనుకునే వారి కోసం గుంటూరులో ప్రత్యేకంగా కొవిడ్ టీకా (covid vaccine) కేంద్రాన్నిఅధికారులు ఏర్పాటు చేశారు. మన దేశంలో కొవిడ్ తీవ్రత దృష్ట్యా.. చాలా దేశాలు ఇక్కడివారిని అనుమతించడం లేదు. తమ దేశానికి రావాలంటే కొవిడ్ టీకా తీసుకుని ఉండాలనే నిబంధన విధించాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విదేశాలకు వెళ్లాలని అనుకునే వారికి ప్రత్యేకంగా టీకా పంపిణీ చేపట్టాయి. రాష్ట్ర ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం దీనిపై నిర్ణయం తీసుకుంది. విదేశాలకు వెళ్లే వారు ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే వారికి టీకా అందించే ఏర్పాట్లు చేయాలని ఆయా జిల్లాల అధికారులను ఆదేశించింది.

డాక్టర్. హసీనా

ప్రభుత్వ ఆదేశాల మేరకు గుంటూరు జిల్లాలో విదేశీ ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా టీకా పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నగరంలోని పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్​లో ఇవాళ టీకా పంపిణీ ప్రారంభించారు. టీకా కోసం వచ్చిన వారిని వరుస క్రమంలో ఉంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు చేపట్టారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారందరికి టీకా అందించే వరకు ఈ కేంద్రాన్ని కొనసాగిస్తామని అధికారులు తెలిపారు. ఈ అవకాశాన్ని విదేశాలకు వెళ్లే వారు వినియోగించుకోవాలని కోరారు.

ఇదీ చదవండీ... కొవిడ్ తగ్గాక.. పరీక్షలు నిర్వహిస్తాం: మంత్రి సురేశ్

Last Updated : Jun 5, 2021, 8:13 PM IST

ABOUT THE AUTHOR

...view details