గుంటూరులోని వేర్వేరు ప్రదేశాలలో నిర్వహిస్తున్న పేకాట స్థావరాలపై పోలీసులు దాడి చేశారు. నల్లపాడు రోడ్డులోని గొర్రెల మండి వద్ద పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేసి... కేవీపీ కాలనీకి చెందిన కాలేషాతోపాటు మరో 26 మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 6 లక్షల నగదు, 27 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా పెదపలకలూరు పంజాబీ దాబా సమీపంలోని మోక్ష అపార్ట్ మెంట్లో 8 మందిని అదుపులోకి తీసుకొని... 13 వేల నగదు , 8 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు సీఐ వీరాస్వామి తెలిపారు.
పేకాట స్థావరాలపై దాడి... భారీగా నగదు స్వాధీనం
గుంటూరులోని పలు చోట్ల పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు చేశారు. 6లక్షల పైగా నగదు... చరవాణులను స్వాధీనం చేసుకున్నారు. 34 మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు.
పేకాట స్థావరాలపై దాడి... భారీగా నగదు స్వాధీనం