రాష్ట్రంలో ఇసుక కొరతతో లక్షలాది మంది కార్మికులు రోడ్డునపడ్డారని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్‌కల్యాణ్‌ను లారీ యజమానులు కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. ప్రభుత్వం కొత్తగా ఉద్యోగాలు ఇవ్వాలే కానీ.. ఉన్నవాటిని తీసేయకూడదని ఈ సందర్బంగా పవన్ కల్యాణ్ అన్నారు. ఇసుక రవాణా ఆగిపోయి కుటుంబాలు వీధినపడ్డాయని లారీ యజమానులు బాధపడుతున్నారని తెలిపారు. ఇసుక కొరత ప్రభావం సమాజంలోని అన్ని వర్గాలపై ఉందని పవన్ అన్నారు. అమరావతిలో రాజధాని కడతారో.. లేదో స్పష్టం చేయాలన్నారు. ప్రజల సమస్యలు గ్రహించి స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. వైకాపా ప్రభుత్వ పాలన చాలా బాధ కలిగిస్తోందన్నారు. ఇసుక ఆన్‌లైన్ బుకింగ్ అర్ధరాత్రి పూట ఎందుకని ప్రశ్నించారు. పక్కరాష్ట్రాల వాళ్లకు ఇసుక దొరుకుతుంది కానీ ఇక్కడ దొరకడం లేదని ఎద్దేవా చేశారు. సమస్యలు పరిష్కరించకుంటే ప్రభుత్వాన్ని ప్రజలు శిక్షించే రోజు వస్తుందన్నారు.
'ఇలాగే చేస్తే ఊరుకోం... రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తాం' - పవన్ కల్యాణ్ ఇసుక వార్తలు
సరైన విధి విధానాలు లేకుండా ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే కచ్చితంగా రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తామని జనసేనాని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. ఇసుక ఆగిపోయి రోడ్డున పడ్డ కార్మికుల తరఫున పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
ఇసుకపై పవన్ కల్యాణ్ మీడియా సమావేశం