రైతుల ఉద్యమాన్ని పోలీసు బలంతో అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆక్షేపించారు. రాజధాని అమరావతిని రక్షించుకునేందుకు రైతుల ఉద్యమం చేస్తున్నారని అన్నారు. రైతులతో కలిసి పోరాడుతున్నందుకే.. చంద్రబాబును అదుపులోకి తీసుకున్నారని విమర్శించారు. ఇలాంటి చర్యలతో శాంతియుతంగా నడుస్తున్న ఉద్యమం.. హింసాత్మకంగా మారే ప్రమాదం ఉంటుందన్నారు. అరెస్టులు, నిర్బంధాలతో ఉద్యమాలను అణిచివేయలేరని స్పష్టం చేశారు. అమరావతిని మరో నందిగ్రామ్‌గా మార్చాలని ప్రభుత్వం భావిస్తోందా? అని ప్రశ్నించారు.
అరెస్టులతో ఉద్యమాలను అణిచివేయలేరు: పవన్ - చంద్రబాబు పోలీసుల అదుపుపై పవన్ కామెంట్స్
రైతుల ఉద్యమాన్ని పోలీసుల బలంతో అణిచివేయలేరని జనసేన అధినేత పవన్ అభిప్రాయపడ్డారు. రైతుల ఉద్యమానికి బాసటగా నిలిచారన్న కారణంతోనే చంద్రబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారని విమర్శించారు.
పవన్ కల్యాణ్