ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

NIA searches: రాష్ట్రంలోని ఆ జిల్లాల్లో ఎన్​ఐఏ సోదాలు..

NIA searches: గుంటూరు, కర్నూలులో అర్ధరాత్రి నుంచి ఎన్‌ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పాత గుంటూరు, కర్నూలులోని పలు ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. పీఎఫ్ఐతో సంబంధం ఉన్న వారిని అధికారులు ప్రశ్నిస్తున్నారు.

NIA searches
ఎన్‌ఐఏ అధికారుల సోదాలు

By

Published : Sep 22, 2022, 12:49 PM IST

NIA searches: గుంటూరులో ఎన్​ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇప్పటి వరకు ముగ్గురు వ్యక్తులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సంగడిగుంటకు చెందిన డ్రైప్రూట్స్ వ్యాపారి జఫ్రుల్లాఖాన్​తోపాటు పొత్తూరువారితోటకు చెందిన రహీం, వహీద్​లను ఎన్​ఐఏ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్​ ఇండియా... పీఎఫ్ఐ కార్యకలాపాలపై, ముగ్గురు వ్యక్తులకు ఆ పార్టీతో సంబంధాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ముగ్గురు వ్యక్తల విచారణ తర్వాత మరిన్ని విషయాలు వెల్లడయ్యే అవకాశముంది.

కర్నూలు నగరంలో ఎన్​ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. నగరంలోని ఖడక్ పూర వీధిలోని ఎస్​డీపీఐ నాయకులు అబ్దుల్ వారిస్ ఇంటిలో ఎన్​ఐఏ అధికారులు తెల్లవారుజామున సోదాలు చేశారు. అబ్దుల్ వారిస్​కు హైదరాబాదులో ఇళ్లు ఉండటంతో కర్నూలు, హైదరాబాద్​లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఎన్​ఐఏ సోదాలకు వ్యతిరేకంగా ఎస్​డీపీఐ నాయకులు నిరసన తెలిపారు. భాజపా ఎన్​ఐఏ సంస్థను అడ్డుపెట్టుకుని కక్ష్యసాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. ఎన్​ఐఏ అధికారులకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details